నీ మొహం
నా మోహంలాలేదు
నీ చేతులు
నా చేతులులా లేవు
నీది వత్తైన వంకీల జుట్టు
నాది బట్ట తల
నీపలుకులు పంచదార గుళికలు
నావి అస్ఫష్టపు మాటలు
నీవి దానిమ్మ గింజలలాంటి పళ్ళు ..
నాకు వున్నవే ఓ పది
అవైనా అక్కడక్కడ
నీ కళ్ళలోని మెరుపు
అద్దాలవెనుక నాకళ్ళలో లేదు
నీవి బుడి బుడి నడకలు
నావి తడబడే అడుగులు
నువ్వు చేసే అల్లరి
నేను చెయ్యలేను
ఇంత కాంట్రవెర్సియల్ పోలికలున్నా
నేను కధ చెప్పందే
నువ్వు నిద్రపోయేదానివి గావు
నువ్వు నా పక్కలో పడుక్కోందే
నాకు నిద్రపట్టేదికాదు
మరి ఇపుడో
నువ్వు అక్కడ
సుదూర ఖండాంతరంలో
నేను ఇక్కడ
ప్రతివిమానం చెప్పుడుకీ
వులిక్కి పడుతూ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment