అమ్మ చిటికెనవ్రేలు పట్టుకొని
చిన్నతనంలో ఆమెతో వెళ్ళేవాడిని
నన్ను భవిష్యత్ లోకి నడిపించింది ఆవ్రేలే
నేను ఉన్నాని ధైర్యం ఇచ్చిందీ ఆవ్రేలే
నాచిటికినవ్రేలు పట్టుకొని
అగ్నిహోత్రం చుట్టూ
ఏడడుగులు నడిచింది
నాసహధర్మచారిణి
కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ
చేదోడువాదోడై నిలచింది
నాచిటికినవ్రేలు పట్టుకొని
నడిచింది నాచిన్నారి మనుమరాలు
వయస్సుమళ్ళిన నాకు బెస్ట్ ఫ్రెండ్
ఎన్నోకబుర్లు చెప్పింది
కధలు చెప్పమనేది
నాదగ్గరే పడుక్కుంటానని మారాంచేసేది
భర్త చిటికినవ్రేలు పట్టుకొని
అగ్నిహోత్రంచుట్టూ ఏడడుగులు నడిచింది
తీపిగుర్తులు నెమరేసుకోమని
అత్తవారింటికి వెళ్ళింది
ఇక నాచిటికినవ్రేలుకు మిగిలింది
తెల్లరాయిపొదిగిన వుంగరం ఒక్కటే
అదైనా సరిగ్గా ఆనడంలేదు
కళ్ళలో నీరు చిమ్మడంతో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment