ఈ నగరంలో ఒకరాత్రి
మంచువర్షమే కురిసింది
దూదిపింజిలా ఎగిసింది
నేలను మృదువుగ తాకింది //ఈ నగరంలో//
ఆదిదంపతుల నృత్యకేళికి
కైలాసశిఖరమే కరిగిందా
ప్రేమానురాగాలు కలబోతతో
పుడిమితల్లిని ముద్దాడిందా //ఈ నగరంలో//
నింగిలో చందమామ వెన్నెలలా
గుమ్మపాలపై తేలిన నురగలా
నేలపై ఒక తెల్లని పరుపులా
మెరిసింది ఈనగరం వెండిలా //ఈ నగరంలో//
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment