Tuesday, July 10, 2012

అలౌకికానందం

ఆగీతంలో భావం రమణీయకం
భాష తేట తెనుగు నుడికారం
శైలి శర్కరాపాకం
అతని పెదాల కదలికలో
ఆగీతాలాపన అనేక రాగాల సమ్మేళనం
తనగానానికి పరవశించిపోతున్నాడు
బాహ్య ప్రపంచాన్నే మరిచిపోయి

ఏదో తెలియని అలౌకికానందం

అది దేవుడివ్వని కంఠంలోని
మౌనరాగం

No comments: