Monday, July 9, 2012

తెలుగు గతి ఇంతే

అక్కడ తెలుగుతనం వెలిగిపోతూవుంటుంది
అక్కడ తెలుగుభాష విలువ పెరిగిపోతూవుంటుంది
అక్కడ తెలుగు పాట అతిమధురంగా పాడబడుతూవుంటుంది
అక్కడ తెలుగు వంట ఘుమఘుమలాడుతూవుంటుంది.

అక్కడ తెలుగు నుడికారపు తీపిని చూపిస్తూవుంటుంది
అక్కడ తెలుగు సోయగం జిగేలుమనిపిస్తుంది
అక్కడ తెలుగు విఙ్ఞానం వికసించిందనిపిస్తుంది
అక్కడ తెలుగు తల్లి స్వయంగా నిలిచిందా అనిపిస్తుంది.

అక్కడ తెలుగుకు జేజేలు వినిపిస్తాయి
అక్కడ తెలుగు పలుక్కి అందాలు అగుపిస్తాయి
అక్కడ తెలుగు నాట్యంకు పాదాలు నృత్యిస్తాయి
అక్కడ తెలుగు ఆదరణకు కళ్ళు చెమరుస్తాయి.

ఆసంబరాల భవన ప్రాంగణ దాటిరాగానే
అలసి సొలసి అర్ధరాత్రి ఇంటికి రాగానే
అదమరచి నిదురపోయి మర్నాడు లేవగానే
తూర్పు తెల్లారి పడమట భాషారాగం మొదలవుతుంది
అంతవరకూ దాగివున్న
ఆంగ్లం విజృంభిస్తుంది
తెలుగు విభ్రాంతి తొలగిపోతుంది
తెలుగే మాయ
తెలుగు పలుకే మాయ్ .

No comments: