Monday, July 9, 2012

తీపి ఎంగిలి

తీపి ఎంగిలి
చుట్టూ పిల్లలు
కంచంనిండా పెరుగు అన్నం
కథలు చెప్తూ ఆతల్లి
ఒక్కో ముద్దా తలొకరికీ

జామచెట్టు నీడలో
బావ, మరదలు
దొరికింది ఒకే దోర జామకాయ
కాకి ఎంగిలి చేసి
"ఇదిగోబావా తిను"

పెళ్ళిలో బూజంబంతి
కొత్తదంపతులకు
ఒకేకంచంలో భోజనం (మారోజుల్లో)
ఇద్దరిలోనూ సిగ్గుదొంతర్లు

తాతగారూ ఆ అనండి
తనుసగంకొరికినపకోడీ
ఆ బోసినోటిలోకి

"ఒసేవ్ గాడిదా
తాతగారికి ఎంగిలి పెడతావటే"


"ఫరవాలేదులే లక్ష్మీ"

కళ్ళుతుడుచుకుంటూ
పకోడీలోని మిరపకాయనికూడా
మధురంగా ఆశ్వాదిస్తూ తాతగారు

No comments: